కనకదుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

కనకదుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ బి. కృష్ణమోహన్
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో వి.కె. శీనా నాయక్
వేద ఆశీర్వచనంతో సత్కరించిన అర్చకుల బృందం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బి. కృష్ణమోహన్ తమ సతీమణితో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను ఈవో వి.కె. శీనా నాయక్, ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్యతో పాటు అర్చకుల బృందం దగ్గరుండి పర్యవేక్షించారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు న్యాయమూర్తి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, అలాగే శ్రీ కనకదుర్గ ఆలయం అమ్మవారి చిత్రపటాన్ని న్యాయమూర్తి దంపతులకు ఈవో శీనా నాయక్ అందజేశారు.
