గ్రామస్థాయిలో రైతు సంఘం బలోపేతం కావాలి..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గ్రామ స్థాయిలో రైతు సంఘం బలోపేతం అయితేనే రైతు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు అన్నారు. మండల పరిధిలోని కేతనకొండ, కొటికలపూడి గ్రామాల్లో రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ సంఘ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. మొక్కజొన్న రైతులు మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు విక్రయించే నష్టపోయారని వాపోయారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వ హామీ ప్రకారం ధరల వ్యత్యాస పథకం కింద ఎకరాకు రూ.21 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు జొన్నలగడ్డ కోటేశ్వరరావు, పత్రి హరికృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.