నూతన సూపరింటెండెంట్‌కు ఎమ్మెల్యే గండ్ర శుభాకాంక్షలు
ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వెంకటరత్నం మంగళవారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరత్నం ఎమ్మెల్యేకు మొక్కను బహుకరించారు.
డాక్టర్ వెంకటరత్నంకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఆస్పత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని ఆకాంక్షించారు.
