ఘనంగా టీడీపీ మహానాడు వర్చువల్ వేడుక..

ఘనంగా టీడీపీ మహానాడు వర్చువల్ వేడుక..

ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం

తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వర్చువల్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. తిరువూరు పట్టణంలోని శ్రీరస్తు కన్వెన్షన్‌లో గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత భారీగా హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా ఏర్పాటు చేయడంతో నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన సందేశాలు, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి లక్ష్యాలను ఎమ్మెల్యే కార్యకర్తలకు వివరించారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహానాడు ద్వారా పార్టీకి కొత్త దిశా నిర్దేశం లభించిందని, ప్రజల్లో మరింత బలంగా ముందుకు వెళ్లేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply