వివాహ వేడుకలో మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే కొలికపూడి..

వివాహ వేడుకలో మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే కొలికపూడి..

విజయవాడ, ఆంధ్రప్రభ : తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం గ్రామంలో జరిగిన పులి వారి వివాహ మహోత్సవం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగతో కలిసి తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు వెంకట ఆదిత్య, చంద్రికలను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

వివాహ మహోత్సవానికి విచ్చేసిన మందకృష్ణ మాదిగ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం మందకృష్ణ మాదిగతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భోజనం చేస్తూ కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఈ వేడుకలో ఉద్దండరాయుని పాలెం గ్రామానికి చెందిన స్థానిక నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, యువతతో పాటు తిరువూరు పట్టణ నాయకులు పాల్గొన్నారు.