కోతుల బెడద యథాతథం..

కోతుల బెడద యథాతథం..

బాపట్ల, ఆంధ్రప్రభ : పట్టణంలోని పలు పురవీధుల్లో కోతుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతుల తరలింపు కోసం పురపాలక అధికారులు తీసుకువచ్చిన కొండముచ్చును ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలోనే అలంకారంగా ఉంచారని ప్రజలు విమర్శిస్తున్నారు.

గతంలో పని చేసిన అధికారి చేపట్టిన కార్యక్రమం ద్వారా కోతుల నియంత్రణలో ఫలితం శూన్యం అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోతుల బెడద నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.