Guntur | వైఎస్ భార‌తిపై అస‌భ్య కామెంట్స్ – టీడీపీ నేత‌పై కేసు న‌మోదు

గుంటూరు, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్​పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో జగన్ సతీమణి భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కిరణ్ తీరు పట్ల తెలుగుదేశం అధిష్టానం తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన తెలుగుదేశం కిరణ్​ను పార్టీ నుంచి సప్పెండ్ చేసింది. అతనిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను అదేశించింది

కేసు న‌మోదు
దీంతో గుంటూరు అరండల్‌ పేట పోలీసులు కిరణ్​పై కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కిరణ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చేబ్రోలు కిరణ్ మరో వీడియో విడుదల చేశారు. క్షణికావేశంలో జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని, మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యల పట్ల తను క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుని అటు పార్టీ నేతలకు ఇటు సమజానికి బలమైన సందేశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Leave a Reply