సీఎస్‌కే బౌలర్లపై లక్నో బ్యాటర్ల విరుచుకుపాటు..
సీఎస్‌కే బౌలర్లపై లక్నో బ్యాటర్ల విరుచుకుపాటు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ముగిసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ ఇంగ్లిస్ కేవలం 33 బంతుల్లో 85 పరుగులు చేసి సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
మార్ష్ (10), పూరన్ (1), పంత్ (15), మార్క్రమ్ (6), అక్షద్ (18), హిమ్మత్ (17) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో ప్రభాస్ 43 పరుగులతో జట్టుకు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. సీఎస్కే బౌలర్లలో ఓపర్ణ్ 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. విజయానికి ఇప్పుడు సీఎస్కేకు 204 పరుగుల భారీ లక్ష్యం ఎదురు నిలిచింది.
