గంగారం అభయాంజనేయ స్వామి ఆలయంలో బోరుబావి ప్రారంభం

గంగారం అభయాంజనేయ స్వామి ఆలయంలో బోరుబావి ప్రారంభం
ప్రజాపక్షపాతి ఎమ్మెల్యే వినోద్: సర్పంచ్ రాజ్ కుమార్
నెన్నెల, ఆంధ్రప్రభ : నెన్నెల మండలంలోని గంగారం గ్రామ అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన బోరుబావిని మంగళవారం గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ ప్రారంభించారు. ఎండకాలం దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులు, ప్రజల తాగునీటి ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్, తన సొంత నిధులతో ఈ బోరుబావిని మంజూరు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల క్షేమం కోరే ఎమ్మెల్యే గడ్డం వినోద్ సేవా దృక్పథం అభినందనీయమని కొనియాడారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం తక్షణమే స్పందించి బోరుబావిని ఏర్పాటు చేయించినందుకు గ్రామ ప్రజల పక్షాన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనసూయ పోచం, వార్డు సభ్యులు వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, కమిటీ సభ్యులు కామెర శ్రీనివాస్, యూత్ సభ్యులు కళ్యాణ్, రాజేందర్, దేవేందర్, రాము, బాపన్న, అంజన్న మాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
