గిరిజన విద్యార్థుల అవస్థలు..

గిరిజన విద్యార్థుల అవస్థలు..

  • మూడు నెలలుగా తిరగని ఫ్యాన్లు
  • ఒకవైపు మండుతున్న ఎండలు ఇనిస్టిట్యూట్లో తిరిగిన ఫ్యాన్లు
  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

వాజేడు, ఆంధ్రప్రభ : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు గత మూడు నెలలుగా విద్యుత్ బల్బులు ఎలగవు ఫ్యాన్లు తిరగవు దీనితో విద్యార్థినిలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గురించి ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఆ ఇనిస్టిట్యూట్ ను సందర్శించాలంటే కేవలం మహిళ ప్రజా ప్రతినిధులు అధికారులై ఉండాలి.

అక్కడికి ఎవరు వెళ్లలేని పరిస్థితి ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ నిర్వాకంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ ఇన్స్టిట్యూట్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థినిలకు అందించే భోజనం మెనూలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు విద్యార్థి తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఇన్స్టిట్యూట్లో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థినిలు చదువుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోటే ఇలా జరుగుతుందని విద్యార్థినిల తల్లిదండ్రులు వాపోతున్నారు.


దీనిపై గిరిజన ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ కిరణ్మయి ను వివరణ కోరగా నేను విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సక్రమంగానే నిర్వహిస్తున్న నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ దాటవేసిన ప్రయత్నం చేయడం గమనార్హం.