బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు..!

  • ప్రజలకు ఇబ్బందులు కలిగించిన 9 మందిపై కేసులు నమోదు

జన్నారం, ఆంధ్రప్రభ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన తొమ్మిది మంది యువకులపై ఆదివారం రాత్రి కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. మండలంలోని పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించిన యువకులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.