ఆలేరు ఈద్గాలో రంజాన్ నమాజ్..

ఆలేరు ఈద్గాలో రంజాన్ నమాజ్..
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని మంతపురి రోడ్ లో ఉన్న బడే ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక నమాజ్ శనివారం జరిగింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చి రంజాన్ నమాజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమామ్ రంజాన్ సందేశమిస్తూ ప్రేమ భావనతో, మానవత్వం, విషయాల తత్వంతో జీవించడమే దైవానికి అందించే గొప్ప ప్రార్థన అని చెప్పారు. రంజాన్ ఉపవాస దీక్షల పవిత్రతతో అందరూ తమ రాబోయే జీవితంలో సుఖ సంతోషాలు ఆనందోత్సాహాలతో మునుముందుకు సాగాలని ఆకాంక్షించారు. పలువురు రాజకీయ పక్షాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
