చత్రపతి ఆరాకటిక యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని చత్రపతి ఆరాకటిక యువజన సంఘం నూతన కమిటీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఊట్కూర్ చత్రపతి ఆరకటిక యువజన సంఘం అధ్యక్షులుగా డీకే ఉపేందర్ జీ, ఉపాధ్యక్షులుగా డీకే రవిరోషాజీ, కోశాధికారిగా డీకే అరవింద్, సహాయ కోశాధికారిగా ఎం. రాజేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జెకె అరుణ్, ప్రధాన కార్యదర్శిగా ఎం. రోషజీ, డీకే ఉదయ్, విద్యార్థి శక్తి ఎం. నందు, సలహాలు దారులుగా డీకే ఆనంద్, ఎం భాస్కర్ తదితరులను ఎన్నుకున్నట్లుతెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు డీకే ఉపేందర్ జీ మాట్లాడుతూ చత్రపతి అరకటిక సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలలో తమ సంఘానికి ప్రాధాన్యత కల్పించి ఆదుకోవాలని కోరారు.
