బీజేపీ సమ్మేళనానికి భారీగా తరలిన శ్రేణులు..
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల బీజేపీ అధ్యక్షుడు సూరబోయిన సతీష్ అన్నారు.
సోమవారం వరంగల్‌లో నిర్వహించనున్న పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సూరబోయిన సతీష్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. “బూత్ గెలిస్తేనే ఎన్నికల్లో విజయం” అనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్‌కు వెళ్లిన వారిలో పోలింగ్ బూత్ అధ్యక్షులు, బీజేపీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
