AP | మొత్తం ఐదు మృతదేహాలు వెలికితీత

AP | మొత్తం ఐదు మృతదేహాలు వెలికితీత

AP | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : భద్రాచలం శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుల్లో ఐదుగురు గల్లంతు కావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురుషోత్తమపట్నం పంచాయతీ పరిధిలోని కొల్లుగూడెం సమీపంలో నిన్న ఈ ఘటన జరిగింది. భద్రాచలం పట్టణానికి చెందిన ఏడుగురు గోదావరిలో స్నానానికి వెళ్లగా, వారిలో ఐదుగురు లోతు తెలియక నదిలో మునిగిపోయినట్లు సమాచారం.

మునిగిపోయిన ఐదుగురు మృతిచెందగా, అందులో ముగ్గురి మృతదేహాలను నిన్న సాయంత్రం వెలికి తీయగా, ఇవాళ ఉదయం సతీష్, తేజ మృతదేహాలను అధికారులు వెలికితీశారు.

Leave a Reply