ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు..

మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి

వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు.అల్లాహ్ దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ.రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన,దాతృత్వం, ప్రేమ,దయ,సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయి అని కోరారు..

Leave a Reply