విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ..
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా, దాత రామాంజనేయ గౌడ్‌తో కలిసి విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా బ్యాగులు అందించిన దాత రామాంజనేయ గౌడ్ సేవాభావాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కారింగు నర్సింహా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరిపంగి శ్రీను, పగిల్లా సోమయ్య, వార్డు సభ్యుడు లపంగి మహేందర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
