రేపటి నుంచి జంగిల్ సఫారీకి బ్రేక్..
- 3 నెలలు జంగిల్ వాహనాలకు విరామం..
- అక్టోబర్ 1న పునః ప్రారంభం..
- అడవి జంతువుల పునరుత్పత్తి తరణం..
- ప్రతి ఏటా అధికార్ల ఆదేశాలు..
జన్నారం, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లోని అభయారణ్యంలో రేపటి నుంచి 3 నెలల పాటు పర్యాటకులు జంగిల్ సఫారీ వాహనాల్లో పర్యటించడాన్నీ నిలిపివేశారు.తర్వాత అక్టోబర్ 1 న అడవుల్లో పర్యాటకులు విహరించడానికి జంగిల్ సఫారీ వాహనాల రాకపోకలను అనుమతిస్తూ పునః ప్రారంభించనున్నారు. కవ్వాల టైగర్ రిజర్వ్ లోని అటవీ అందాలను పర్యాటకులు అడవుల్లోకి వెళ్లి వీక్షించడానికి సఫారీ వాహనాలను ఏడాదిలో 9 నెలలు అనుమతించి,ఈ వర్షాకాలంలో 3 నెలలు అడవుల్లోకి పర్యాటకులను,సఫారీ వాహనాలను 3 నెలలు వాహనాలను అనుమతించరు.

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ఆదేశాల మేరకు వర్షాకాలం తరుణంలో అడవుల్లోని పెద్దపులులు, చిరుతపులులు,ఇతర జంతువులు సంతానోత్పత్తి (మీట్), సహజ ఆవాసాల పరిరక్షణ,పర్యావరణ సమతుల్యత, పర్యటకుల భద్రత దృష్ట్యా అటవీ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం కవ్వాల అడవుల అందాలను వీక్షించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో 5 సఫారీ వాహనాలు,తెలంగాణ టూరిజం శాఖ హరిత ఆధ్వర్యంలో 2 సఫారీ వాహనాలు ఉన్నాయి.

ప్రతి వాహనానికి వీకెండ్ రోజులైనా శుక్ర,శని,ఆదివారాల్లో రూ.4వేలు,సాధారణ రోజులైనా సోమ,బుధ,గురు వారాల్లో రూ.3500 డబ్బులు చెల్లించి అడవుల్లోకి సఫారీ వాహనాల్లో పర్యాటకులను అనుమతిస్తారు.ప్రతి మంగళవారం సఫారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు సెలవు దినం.సఫారీ వాహనాలు నడిచినట్లయితే పర్యాటకుల తాకిడి ఉండి,ఈ ప్రాంతం కళకళలాడుతుండేది. పర్యాటకుల రాకపోకలు లేక ఈ ప్రాంతం బోసిపోనుంది.
3 నెలలు జంగిల్ సఫారీ నిలిపివేత..
ఎఫ్డీఓ రామ్మోహన్..

కవ్వాల అభయారణ్యంలోని అడవుల్లో పర్యాటకుల రాకపోకలకు జంగిల్ సఫారీ వాహనాలను 3 నెలలు నిలిపివేస్తున్నట్లు జన్నారం ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ చెప్పారు.సోమవారం ఎఫ్డీఓ మాట్లాడుతూ.. జూలై 1 నుంచి నవంబర్ 30 వరకు అడవుల్లోకి పర్యటకులను అనుమతించారన్నారు.ఎన్టీసీఏ మార్గదర్శకాల మేరకు ఏడాదిలో 3 నెలలు అడవుల్లోకి సఫారీ వాహనాలను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
ఈ వర్షాకాలంలో అడవి జంతువుల పునరుత్పత్తి, సహజ ఆవాసాల పరిరక్షణ,పర్యావరణ సమతుల్యత, పర్యాటకుల భద్రత దృష్ట్యా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.మంగళవారం సఫారీ వాహనాల డ్రైవర్లకు సెలవు కనుక రేపటి నుంచి సఫారీ వాహనాలను బందు పెడుతున్నట్లు ఆయన చెప్పారు.అక్టోబర్ 1న పర్యాటకులను అనుమతిస్తూ సఫారీ వాహనాలను పునః ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం..
హరిత రిసార్ట్ మేనేజర్ వీరేంద్ర కుమార్..

అడవుల్లోకి సఫారీ వాహనాలను 3 నెలలు నిలిపివేయడంతో హరిత రిసార్ట్ లకు పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ జన్నారం హరిత రిసార్ట్ మేనేజర్ వీరేంద్ర కుమార్ చెప్పారు.ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి అభయారణ్యంలోని అందాలను వీక్షించడానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు.
