డాక్టర్ రాజేందర్ రెడ్డి కి హెల్త్ కేర్ ఎక్సలెన్స్–2026 పురస్కారం
డాక్టర్ రాజేందర్ రెడ్డి కి హెల్త్ కేర్ ఎక్సలెన్స్–2026 పురస్కారం
రాజేందర్ రెడ్డి తరఫున అవార్డు స్వీకరించిన ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్న తొర్రూరు మండలం చెర్లపాలెం వాసి, ఎన్నారై డాక్టర్ అనుమాండ్ల రాజేందర్ రెడ్డి కి జీ తెలుగు న్యూస్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026 దక్కింది. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ వేదికగా ఈ తెలుగు న్యూస్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్–2026 అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. అమెరికాలో కార్డియాలజిస్ట్ గా పేరుగాంచి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ రాజేందర్ రెడ్డిని గుర్తించిన ప్రముఖ జీ తెలుగు న్యూస్ ఛానల్ అవార్డుకు ఎంపిక చేసింది.దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత వైద్యులకు హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డులు దక్కాయి.రాజేందర్ రెడ్డి అమెరికాలో ఉండటంతో ఆయన తరపున సతీమణి, వేటా అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అవార్డు ను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణుడిగా సేవలందిస్తున్న డా. హనుమాండ్ల రాజేందర్ రెడ్డి గారికి హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు-2026 లభించడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. వైద్య రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవంతో అనేకమంది రోగులకు సేవలందిస్తూ, భారతీయ వైద్యుల ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్న విషయం తెలిసిందే…ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలను కేవలం ఉద్యోగంగా కాకుండా మానవ సేవగా భావిస్తూ ప్రజల ఆరోగ్యానికి జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి ఆదర్శమైన వైద్యుడు అని కొనియాడారు. వైద్యరంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
