ఘనంగా శ్రీ ధన మైసమ్మ ఉత్సవాలు

ఘనంగా శ్రీ ధన మైసమ్మ ఉత్సవాలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ:
గ్రేటర్ వరంగల్ శివనగర్ మెట్లబావి ప్రాంతంలోని శ్రీ ధన మైసమ్మ దేవాలయాన్ని స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా, ఆలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాలను జూన్ 20, 21 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న తెలిపారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించే అమ్మవారి విగ్రహాల ఊరేగింపు కార్యక్రమానికి వరంగల్ మట్టేవాడ నివాసులు మాడిశెట్టి శ్రీనివాస్ – శ్రీవాణి దంపతులు ప్రత్యేకంగా కేరళ బ్యాండ్ మేళాలను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. శ్రీ ధన మైసమ్మ అమ్మవారి కటాక్షంతో శ్రీనివాస్ – శ్రీవాణి దంపతుల కుటుంబ సభ్యులైన చిలకమ్మ, కీర్తిశేషులు సదాశివుడు, తమ్ముడు నాగరాజు, కుమార్తెలు అనన్య, హర్ష నందినిలు కోరిన కోరికలు నెరవేరడంతో, వారు కృతజ్ఞతగా ఈ విగ్రహాల ఊరేగింపునకు కేరళ బ్యాండ్ మేళాలను సమర్పిస్తున్నట్లు తెలిపారు.

అమ్మవారి ఉత్సవాల కోసం ఈ మేళాలను ఏర్పాటు చేస్తున్నందుకు గాను మాడిశెట్టి శ్రీనివాస్ – శ్రీవాణి దంపతులకు ఆలయ కమిటీ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మెంగని నరేష్, సుంచు మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ ధన మైసమ్మ ఉత్సవాలు