ఉప్లూర్ లో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

ఉప్లూర్ లో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ:
కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన ఒక లబ్దిదారునికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కును మంగళవారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ లబ్ధిదారుడి నివాసానికి స్వయంగా వెళ్లి ఈ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రేగుల శంకర్ అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ లబ్ధి చేకూరిందన్నారు. బాధితునికి రూ.17,500 విలువ గల చెక్కు మంజూరు కాగా, దానిని లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి అందజేసినట్లు ఆయన తెలిపారు. పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కావడానికి ప్రత్యేక కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబెర్ బాస వేణుగోపాల్ యాదవ్‌కు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కరి ముత్యం, వార్డ్ సభ్యుడు దాసరి రాకేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఎనేడ్ల గంగారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యాయవాది సుంకరి విజయ్ కుమార్, డాక్టర్ నరేష్, సాధుల్లా, దినేష్, నజీర్, ఉబేద్, నర్సయ్య, బాజెసాబ్ తదితరులు హాజరయ్యారు.

ఉప్లూర్ లో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ