పితృ దోష నివారణకై అమావాస్య అన్నదానం

పితృ దోష నివారణకై అమావాస్య అన్నదానం

వాసవి కన్యకా పరమేశ్వరి సేవా కమిటీ

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయడం ద్వారా పితృ దోషాలు తొలగిపోతాయని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం నేరేడుచర్ల లో దాతల సహకారంతో కన్యకా పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 700 మంది నిరుపేదలకు, బాటసారులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. గత 19 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామన్నారు. అన్ని దానాలలో కంటే అన్నదానం గొప్పదని ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా కమిటీ సభ్యులు రాచకొండ శ్రీనివాసరావు, ఊటుకూరు నటరాజ్, కొత్తా లక్ష్మణ్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, భువనగిరి అంజయ్య, కందిబండ శ్రీనివాసరావు, గుండా సత్యనారాయణ, జగిని సురేష్, కట్టమూరి మధు, రాచకొండ రవి, తాళ్లూరి శ్రీనివాస్, మాశెట్టి సైదయ్య, పాల్వాయి గోపాలకృష్ణ,మాశెట్టి మోహన్, నీలా రామ్మూర్తి, గరిణె వాసు, గరిణె కామేశ్వరరావు, కందిబండ రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply