జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు

జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు

జీసీసీ డీఎం గుడిమల్ల సందీప్ కుమార్

ఉట్నూర్ , ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధిలోని వివిధ గిరిజన ప్రాధమిక మార్కెటింగ్ సహకార సొసైటీ (జీపీసీఎంఎస్) ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపడుతున్నట్లు ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఆదిలాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో సేకరించి, నిల్వా చేసిన తేనె ను పరిశీలించారు. ఇప్పటివరకు జీసీసీ ద్వారా 25 క్వింటాళ్ళ తేనె ను, 122 క్వింటాళ్లు ఇప్పపువ్వు సేకరించినట్లు తెలిపారు.ఆదివాసీలు, గిరిజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మధ్య దళారులకు అమ్మి మోసపోకుండా జీసీసీ డీఆర్ డిపోల వద్ద, సొసైటీ కార్యాలయాల వద్ద విక్రయించి రశీదు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మేనేజర్ ఇస్తారి, ఉట్నూర్ అకౌంటెంట్ గోవిందరావు,ఉద్యోగులు
రమేష్, సవాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.