జీలుగ విత్తనాల పంపిణి ప్రారంభం..
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని స్థానిక పిఏసిఎస్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శనివారం జీలుగ విత్తనాల పంపిణి ప్రారంభించారు.30కేజీ ల బస్తా ధర రాయితీ అనంతరం రూపాయలు 2452.50 లకు అందజేస్తున్నట్లు తెలిపారు.జీలుగను పొలంలో 45 నుండి 60 రోజుల మధ్యలో కలియడున్నడం వల్ల భూమి సారవంతం పెరిగి దిగుబడి పెరుగుతుంది అని వ్యవసాయశాఖధికారి నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ సంగెం వెంకట్ రాజు, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, సర్పంచ్ ఓస కవిత రాజు,పిఏసిఎస్ కార్యనిర్వాహణ అధికారి వజీర్ పాషా,నాయకులు వొద్నాల రాజేశ్వర్, ఓస రాజేశ్వర్,ముత్యం రెడ్డి,రామ్ రెడ్డి, భూమన్న, వ్యవసాయశాఖ సిబ్బంది పవిత్ర, మౌనిక, సుస్మిత, రైతులు పాల్గొన్నారు.
