Vaccine | మేకల, గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమం

Vaccine | మేకల, గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమం

Vaccine | జైనూర్, ఆంధ్రప్రభ : పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఈ రోజు జై నూరులో మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ(prevention of measles) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొమరంభీం అసిఫాబాద్ అసిఫాబాద్ జైనూర్‌ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొని మేకలకు నట్టల నివారణ వ్యాక్సిన్(vaccine) చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నట్టల నివారణ కార్యక్రమాలు రైతులు సద్వినియోగం చేసుకొని తమ మేకలకు గొర్రెలకు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి మురళీకృష్ణ వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ సికిందర్, పశు వైద్య సిబ్బంది ప్రకాష్, మంగీలాల్, సూర్యకాంత్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply