ఇంటింటి ప్రచార కార్యక్రమం..

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు బిజెపి అభ్యర్థి బొట్టు ఉషారాణి శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి తెలుపుతూ తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి నినాదంగా సాగుతున్న బిజెపికి మద్దతు పలకాలని ఆమె కోరారు. ప్రచార కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
