టాస్క్ ఫోర్స్ దాడిలో చిక్కిన అంతర్ రాష్ట్ర ఎర్ర స్మగ్లర్

టాస్క్ ఫోర్స్ దాడిలో చిక్కిన అంతర్ రాష్ట్ర ఎర్ర స్మగ్లర్

  • రూ కోటి 96 లక్షల విలువైన దుంగలు, వాహనాల స్వాధీనం
  • తిరుపతి ఎస్ పి సుబ్బారాయుడు వెల్లడి

తిరుపతి (రాయలసీమ బ్యూరో), ఆంధ్రప్రభ : ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ దాడిలో ప్రముఖ అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ నాసర్ పట్టుబడినట్టు టాస్క్ ఫోర్స్ హెడ్, తిరుపతి జిల్లా ఎస్ పి సుబ్బారాయిడు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను తెలిపారు. ఆ వివరాల ప్రకారం ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెల్లవారు జామున శేషాచలం అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు.

ఆ దాడిలో రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనంతో పాటు 76 ఎర్ర చందనం దుంగలను పట్టుకున్నారు. ఆ సందర్బంగా సుమారు 3 సంవత్సరాల క్రితం శేషాచల అడవులలో రవాణా చేసి దాచి ఉంచి ఈరోజు వివిధ రాష్ట్రాలకు తరలించడానికి యత్నిస్తున్న వారిలో పట్టుబడిన నాసర్ (55) కేరళం రాష్ట్రానికి చెందిన అంతరరాష్ట్ర స్మగ్లర్ గా గుర్తించారు.

అదే సమయంలో తప్పించుకున్న మరో ముగ్గురు స్మగ్లర్ ల కోసం గాలింపు ముమ్మరం చేసారు. పట్టిబడిన నాసర్ పలు స్మగ్లింగ్ నేరాలలో దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడని, ఈరోజు దాడిలో రూ కోటి 96 లక్షల విలువైన దుంగలు, వాహనాలు పట్టుబడినట్టు ఎస్ పి సుబ్బారాయుడు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించిన ఆయన వారికి రివార్డులు ప్రకటించారు.

Leave a Reply