పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అప్పగింత

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అప్పగింత
టేకుమట్ల, ఆంధ్రప్రభ: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి టేకుమట్ల పోలీసులు బాధితుడికి అప్పగించారు.
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన తిరుపతి ఈ నెల 6న భద్రాచలం వెళ్లిన సమయంలో రూ.30 వేల విలువైన ఒప్పో మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అనంతరం ఆయన టేకుమట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఫోన్‌ను ట్రాక్ చేసి గుర్తించారు. అనంతరం సోమవారం బాధితుడికి ఫోన్‌ను అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్సై అమూల్య మాట్లాడుతూ ఎవరికైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.
