స్వర్గీయ వి. ఎమ్. రంగా అనుచరుడు మృతి…
స్వర్గీయ వి. ఎమ్. రంగా అనుచరుడు మృతి…
పాయకాపురం, ఆంధ్రప్రభ : మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహనరంగా ముఖ్య అనుచరుడు గరికిపాటి వీర వసంతరావు ఆకస్మిక మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ చందన సురేష్ (మామ)మంగళవారం గరికపాటి వీర వసంతరావు మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం గరికపాటి వీర వసంతరావు మృతదేహానికి స్వర్గపురిలో మట్టి ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయాన్ని వసంతారావు కుటుంబ సభ్యులకు సురేష్ అందజేసి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 20 డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోటేపల్లి చిన్న, జనసేన నాయకులు కొవ్వూరి కిరణ్, 20 డివిజన్ పెద్దలు కొప్పుల వెంకట్, కొప్పుల మల్లి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
