పూజారి దంపతులకు సన్మానం

పూజారి దంపతులకు సన్మానం
కరీమాబాద్, ఆంధ్రప్రభ : చారిత్రాత్మక మెట్ల బావి శ్రీ ధన మైసమ్మ దేవాలయం, ఆలయ అర్చకులు వెంకన్న – మాధవి వివాహ మహోత్సవం పురస్కరించుకొని ఆలయ అధ్యక్షులు తోట బాబన్న, సంధ్య ఘనంగా సన్మానించారు. మంగళవారం దేవాలయంలోపూజారి దంపతులకు పుష్పగుచ్చం అందజేసి నూతన వస్త్రాలు బహూకరించారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న మాట్లాడుతూ… ఆలయం స్థాపించినప్పటి నుండి అర్చకులు వెంకన్న అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో వారు, వారి కుటుంబ సభ్యులు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు
