త్వరితగతిన వడ్లు కొనుగోలు చేయాలి
త్వరితగతిన వడ్లు కొనుగోలు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ రాములు
జన్నారం, ఆంధ్రప్రభ: త్వరితగతిన రైతులు పండించిన వడ్లను కొనాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మోర్రిగూడ,పొనకల్ మార్కెట్ యార్డులోని సెర్ప్ వడ్ల కొనుగోలు కేంద్రాలను,స్థానిక మార్కెట్ యార్డులోని గోదామును మంగళవారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన వడ్లను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు చేయాలన్నారు.ఆ తర్వాత కొనుగోలు చేసిన వడ్లను నిర్ణయించిన గోదాములు, రైస్ మిల్లులకు చేర్చాలని, డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వీలైనంత తొందరగా జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం శ్రీకళ,డీసీఎస్ఓ బ్రహ్మయ్య, స్థానిక తాహసిల్దార్ బక్కయ్య, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, స్థానిక సెర్ప్ ఏపీఓ లలితకుమారి,ఎంఆర్ఐ గంగరాజు,తదితరులు పాల్గొన్నారు.
