ప్రమాదవశాత్తూ గడ్డివాము దగ్ధం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తూ గడ్డివాముకు మంటలు అంటుకుని దగ్ధమైన ఘటన శనివారం కేసముద్రం మండలం పెద్దమోరీ తండాలో చోటుచేసుకుంది.

తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దమోరీ తండాకు చెందిన భూక్యా బాలు గడ్డివాముకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తండావాసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న మహబూబాబాద్ అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అలాగే సమీపంలో ఉన్న మరో రెండు గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా కాపాడారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల విలువైన గడ్డి కాలిపోయినట్లు బాధిత రైతు భూక్యా బాలు తెలిపారు.

Leave a Reply