TelanganaPolitics | రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

TelanganaPolitics | రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి..

TelanganaPolitics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నాయకులకు గౌరవం ఉండేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుగా విజయవంతంగా నిలిచింది టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు హామీల అమలుపై ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కూడా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని ఆరోపించారు. తెలంగాణలో జూన్ 25 నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీలో పదవుల విక్రయాలపై గతంలో ఆ పార్టీ నేతలే ఆరోపణలు చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నాయకుల పాత వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలాగే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఆమె నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు.