Tirumala13thjune26 | తిరుమలలో భక్తుల రద్దీ..

Tirumala13thjune26 | తిరుమలలో భక్తుల రద్దీ..

Tirumala13thjune26 | సర్వదర్శనానికి 24 గంటలు
గోగర్భం డ్యాం వరకు విస్తరించిన క్యూ లైన్లు
శనివారం, పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో పెరిగిన భక్తుల రాక

Tirumala13thjune26 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శ్రీవారి దర్శనానికి శనివారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. రెండో శనివారం కావడంతో పాటు విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూ లైన్లు ఆక్టోపస్ భవనం దాటి గోగర్భం డ్యాం వరకు విస్తరించాయి. టోకెన్లు లేకుండా సర్వదర్శన క్యూలైన్‌లో ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

భక్తులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ రద్దీ నిర్వహణ చర్యలను మరింత పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 74,636 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 43,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.64 కోట్లుగా నమోదైంది.

లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 4.21 లక్షల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో 3.18 లక్షల మంది భక్తులు ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

CLICK HERE TO READ Tirumala13thjune26 | శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్

CLICK HERE TO READ MORE

Leave a Reply