TG| సమస్యలు పరిష్కరించాలి..

TG| సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రవిదాస్ మోచిల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం సభ్యుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసం మోచి సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది, సంగారెడ్డి జిల్లా టౌన్ ప్రెసిడెంట్ కనేరి సీతారాం ఆధ్వర్యంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రవిదాస్ మోచి సంఘం నాయకులు పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం సహాయం చేయాలని కోరారు. ఇందుకు జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నాయకులు, టౌన్ నాయకులు రమేష్, దేవరాజ్, ఉమాశంకర్, పులి సుభాష్, రాజు, బాలరాజ్, శీను, చిన్న మనోహర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
