Municipal Elections | తెలంగాణలో క్యాంపు రాజకీయాలు

Municipal Elections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ , హోటల్స్ నిండిపోయాంటా. ప్రేమికుల రోజు కదా ప్రేమికులతో నిండిపోయింది అనుకునేరు, అందులో ఉన్నావారు, ప్రేమికులు కాదు, మున్నిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు. తెలంగాణలో మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు చేరకుండా క్యాంపు రాజకీయం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు.
తెలంగాణలో 116 మున్సీపాలిటీల్లో 2582 వార్డులు, 7 కార్పోషన్లలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 717 వార్డులతో, 66 మున్సిపాలిటీల్లో విజయం సాధించి మొదటి స్థానంలో ఉంది. బీఆర్ఎస్ 216 వార్టులో గెలిచి 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీజేపీ 216 వార్డులు గెలిచి తన ఉనికిని కాపాడుకుంది. కాగా 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ కుడా పూర్తిగా వార్డుల్లో విజయం సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. అంటూ కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగుడెంలో సీపీఐ కాంగ్రెస్ పార్టీలు సమానంగా స్థానాలు పొందింది. కానీ కాంగ్రెస్ సీపీఐతో మంతనాలు జరపకుండా మేయర్ పీఠాని దక్కించుకోవాలని చూస్తుంది. దీంతో సీపీఐకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చెందుకు ముందుకు వచ్చింది. దీంతో కాంగ్రెస్ సీపీఐ ల మధ్య వార్ మొదలైంది. దీంతో మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడడంతో ప్రధాన పార్టీల మధ్య గందరగోళం ఏర్పడింది. ఎలాగైనా అధిక మున్సిపాలిటీలు పొందేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయాత్నాలు చేస్తుంది. గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజాయ్ మధ్య ఘర్షణల మధ్య ఎన్నికలు జరిగాయి. దీంతో జీవన్ రెడ్డి మద్దతుదారులు భారీ మోజరీటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు జీవన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. బెల్లంపల్లిలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయం మరింత హీట్ ఎక్కింది.
ఆదిలాబాద్ లో 49 వార్డులో ఉండగా అందులో బీజేపీ 21 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే ఎక్స్ ఆఫిసీయో అభ్యర్థులను కుడగట్టుకోని బీజేపీ 23 స్థానాలకు చేరువయ్యారు. దీంతో ఆదిలాబాద్ పీఠం పొందేందుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. హంగ్ వచ్చిన చోట బీఆర్ఎస్ కు బలమైన మద్దతు ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. దీంతో తెలంగాణలో రసవత్తరంగా మున్సిపల్ క్యాంపు పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్ , ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, మహబుబూనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో హంగ్ ఏర్పడడంతో గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్ లోకి తరలించారు. తెలంగాణలో త్వరలో మేయర్ డిప్యూటీ మేయర్, చెర్మన్ , డిప్యూటీ చెర్యన్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న….
