జిల్లా కేంద్రంలో ప్రత్యేక వేడుకలు..

వికారాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాతీయ జెండాను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రసాద్ వెంకటాచారి, మున్సిపల్ చైర్‌పర్సన్ గట్టమనేని సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వి. సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్ తదితరులు హాజరయ్యారు. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply