మహారాష్ట్ర ధాన్యం తీసుకువస్తే చర్యలు తప్పవు

మహారాష్ట్ర ధాన్యం తీసుకువస్తే చర్యలు తప్పవు

క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
తహసీల్ధార్ ఆడే కమల్ సింగ్ హెచ్చరిక

కుంటాల, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర ప్రాంతం నుండి జొన్నలను విక్రయించడానికి తెలంగాణకు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్ ఆడే కమల్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర ధాన్యాన్ని తెలంగాణలో రైతులు విక్రయిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైతులు జొన్నలను తీసుకురావద్దని పేర్కొన్నారు.

రైతుల పట్టా పాస్ బుక్ సైతం రద్దు చేయడం జరుగుతుందని.. క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని.. హెచ్చరించారు. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని.. అదేవిధంగా దౌనెల్లి ప్రాంతంలో చెక్ పోస్ట్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందని.. పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జొన్నలను మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తెలంగాణకు తీసుకురావద్దని హెచ్చరించారు.

Leave a Reply