ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా డాక్టర్ రామచంద్రయ్య..
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. రామచంద్రయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇదే ఆసుపత్రిలో ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనకు ప్రభుత్వం తిరిగి ఈ బాధ్యతలను అప్పగించింది.
ఈ సందర్భంగా డా. రామచంద్రయ్య మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతానని చెప్పారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, పేద రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. రామచంద్రయ్యకు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికారు.
