అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమకారుడు మృతి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ నగర్ విధికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దంతాన్ పల్లి తిమ్మారెడ్డి(75) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరిమల్లప్ప సంతాపం వ్యక్తం చేశారు.
తిమ్మారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటనివిచారంవ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తిమ్మారెడ్డి కీలకపాత్ర వహిస్తూ పలు ఉద్యమాలలో చురుగ్గాపాల్గొన్నారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీలో చురుకైన నాయకుడిగాపనిచేశారు. మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు తిమ్మారెడ్డి అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామమైన ఊట్కూర్ లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య అనంతమ్మ నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
