మక్తల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య అన్నారు .అధికార కాంగ్రెస్ కు అభివృద్ధి చేయడం ఎంత మాత్రం చేతకాదని అన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి కోసం మక్తల్ పట్టణ ప్రజలు బిజెపిని ఆశీర్వదించాలని కోరారు. 11వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయ శ్రీ చిన్న కొండయ్య కు మద్దతుగా ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి వార్డు పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. గడపగడపకు ఆ కుటుంబాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జయశ్రీ చిన్న కొండయ్య కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు .

ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ మక్తల్ పట్టణంలో 1995 నుండి బిజెపి బలంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల మద్దతుతో గతంలో మూడు ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందడం జరిగిందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోను బిజెపికి మెజారిటీ ఇచ్చిన మక్తల్ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు .11వ వార్డులో సీసీ రోడ్లు మురుగు కాలువలు విద్యుత్ సమస్య తాగునీటి సమస్య పరిష్కారానికి పూర్తి బాధ్యత తీసుకుంటామన్నారు. తొలి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని అప్పగించిన పట్టణ ప్రజలు రెండవ మున్సిపల్ ఎన్నికల్లోను మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు .

కేంద్ర ప్రభుత్వంతో పాటు పార్లమెంటు సభ్యులు డీకే. అరుణమ్మ సహకారంతో మక్తల్ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత బిజెపి తీసుకుంటుందన్నారు. మాటలు చెప్పి మోసం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ నుండి అభివృద్ధిని ఆశించడం అత్యాశ అవుతుందే తప్ప మరేమీ సాధ్యం కాదన్నారు .అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ మాటలకు మోసపోయి మోసపడవద్దని మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరారు.

11న జరగనున్న ఎన్నికల్లో 11వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయ శ్రీ చిన్నకొండ కమలం గుర్తుకు ఓటు వేసి అదేవిధంగా మిగతా వార్డుల్లోనూ కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో అభ్యర్థితో పాటు బిజెపి నాయకులు ఎన్నికల పరిశీలకులు శరణప్ప తల్వార్ , జయానందన్ రెడ్డి ,నీలవర్దన్ రెడ్డి, నరసింహారెడ్డి ,చెన్నారెడ్డి,బి. కురుమయ్య ,దండు వెంకటయ్య ,మేదరి మనోహర్,గుడిసె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.