100 crores | టీవీకే అధినేత విజయ్‌కి షాక్..

100 crores | టీవీకే అధినేత విజయ్‌కి షాక్..

మద్రాసు హైకోర్టు నోటీసులు

100 crores | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు నేడు నోటీసులు జారీ చేసింది. విజయ్ తన అఫిడవిట్‌లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించలేదని, ఇది నిబంధనల ఉల్లంఘన అని పెరంబూర్ నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు కోర్టులో పిటిషన్ వేశారు.

విజయ్ పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుండి నామినేషన్లు దాఖలు చేశారు. పెరంబూర్ అఫిడవిట్‌లో పెండింగ్ కేసులు ఏవీ లేవని పేర్కొనగా, తిరుచ్చి తూర్పు అఫిడవిట్‌లో రెండు పెండింగ్ కేసుల వివరాలను పొందుపరిచారు. ఈ పరస్పర విరుద్ధ సమాచారంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరగా, హైకోర్టు విజయ్‌తో పాటు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు పంపింది.

Leave a Reply