ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు

నిర్వహిస్తున్న పశ్చిమ తహశీల్దార్ డి.రిబ్కా రాణి

భవానిపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై తనిఖీలు నిర్వహిస్తున్న పశ్చిమ తహశీల్దార్ డి.రిబ్కా రాణి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వివిధ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం తనిఖీల్లో భాగంగా గురువారం పశ్చిమ నియోజకవర్గంలో మట్ట లాజరస్ ప్రభుత్వం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, శుభ్రత, వంటశాల నిర్వహణ, సరుకుల నిల్వ, తాగునీటి సౌకర్యం, మెనూ అమలును పరిశీలించారు. భోజనం నాణ్యతపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పథకం సక్రమంగా అమలవుతున్నదీ, వంటకాలు శుభ్రంగా సిద్ధమవుతున్నాయా అన్నది పరిశీలించి, విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, సంబంధిత సిబ్బందికి నిబంధనల ప్రకారం పని చేయాలని సూచించారు.

Leave a Reply