ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి శ్రేణులు భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు.
అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సుకాసి కిరణ్ కుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుంచం దుర్గారావు, బెవర రవి కుమార్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు సుకాసి సరిత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బంక నాగమణి, వడిపిన రామచంద్ర రావు, కుంచం బాలకృష్ణ, గాబు నూకరాజు, వేంపడ యర్రరెడ్డి, సారిపల్లి దుర్గారావు, మొల్లేటి రాము, పద్మనాభుని వెంకటేశ్వర్లు, షేక్ మదీనా, నవిరి మహేష్, తమ్మిన శేఖర్, పుప్పాల దుర్గ బల్ల బాజీ భాస్కర్, కిలిం నాగరాజు, పొట్నూరి శేషు, కాకి సత్యనారాయణ, కొల్లి దుర్గారావు, బాయన తేజ, కొరగంజి వినోద్, సగురుపీళ్ళ సోమేశ్వరరావు, కాలపు రెడ్డి బంగారయ్య, కుంచం విజయ్, మైలపిల్లి అప్పన్న, టిడిపి అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
