Support teams | నలుగురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

Support teams | నలుగురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

Support teams | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిట్ల మండల పరిధిలోని బొల్లక్‌పల్లి సమీపంలో మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గల్లంతైన వారిలో ఒకరి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. మిగిలిన ముగ్గురు ఆచూకీ కోసం స్థానికులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.