2026 january | బ్యాంకులకు వరుస సెలవులు

2026 january | బ్యాంకులకు వరుస సెలవులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొత్త ఏడాది 2026 జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. వీటిలో జాతీయ పండుగలతో పాటు, ప్రాంతీయ పండుగలు కూడా ఉండటంతో కొన్ని రాష్టాల్లో వేర్వేరు రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం..

జనవరి – 1 గురువారం న్యూ ఇయర్,

జనవరి – 2 శుక్రవారం మన్నం జయంతి,

జనవరి- 3 శనివారం హజ్రత్ అలీ పుట్టినరోజు,

జనవరి – 12 సోమవారం స్వామి వివేకానంద జయంతి,

జనవరి -14 బుధవారం భోగి,

జనవరి -15 గురువారం సంక్రాంతి,

జనవరి -16 శుక్రవారం కనుమ / తిరువళ్ళువర్ దినోత్సవం,

జనవరి -17 శనివారం ఉఝవర్ తిరునాల్,

జనవరి -23 శుక్రవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి,

2026 january
2026 january

జనవరి – 26 సోమవారం గణతంత్ర దినోత్సవం కారణంగా దేశమంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మొత్తంగా చూస్తే.. వచ్చే నెలలో 4 ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతో పాటు వివిధ రాష్ట్రలతో కలిపి దేశ వ్యాప్తంగా 16 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ పండుగ సెలవులతో పాటు అన్ని ఆదివారాలు, రెండవ ఇంకా నాలుగవ శనివారాల్లో బ్యాంకులు ఎప్పటిలాగే మూసి ఉంటాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు ఎప్పటిలాగే పని చేస్తాయి. అయితే కొన్ని సెలవులు కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే ఈ వరుస సెలవుల నేపథ్యంలో అప్రమత్తత అవసరం కానుంది.

click here to read Good News| Gold Rate | ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌…

click here to read more