పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన ఎస్సై శ్రీధర్

  • సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసిన మూడు మొబైల్ ఫోన్లు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మూడు మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో గుర్తించి, సంబంధిత యజమానులకు పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయించుకోవడం ద్వారా దుర్వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అఖిల్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ రమ్యశ్రీ పాల్గొన్నారు.