కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి: బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న పిలుపునిచ్చారు.
డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆశీస్సులతో నూతనంగా ఎన్నికైన కడెం మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులను శుక్రవారం కడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్, ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.
పార్టీ బలోపేతానికి ప్రతి సభ్యుడు సమిష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కడెం మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాజీద్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు తక్కల రాధ సత్తన్న, పార్టీ నాయకులు దూల్లే వెంకటేష్, షర్ఫుద్దీన్, బైరి శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
