అక్రమ దందాలకు చెక్‌.. కఠిన చర్యలు తప్పవు

హాసన్‌పర్తి సీఐ మహేందర్ హెచ్చరిక

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : మట్టి, ఇసుక, పీడీఎస్ బియ్యం వంటి అక్రమ దందాలకు ఇకపై తావులేదని హాసన్‌పర్తి సీఐ మహేందర్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి, మొరం, ఇసుక, పీడీఎస్ రైస్ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీఐ మహేందర్ స్పష్టం చేశారు. అక్రమ దందాలను ప్రోత్సహించే వారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.