Road accident | పదికి చేరిన మృతుల సంఖ్య…

Road accident | పదికి చేరిన మృతుల సంఖ్య…
కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళా మృతి.
Road accident | కర్నూలు జిల్లా, ఆంధ్రప్రభ : జిల్లాలోని మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. తాజాగా శనివారం మృతి చెందిన మహిళను ఆర్. శుభ అలియాస్ సుబ్బమ్మగా గుర్తించారు.
ఆమె కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు తాలుకా, శెట్టిగేర్ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటికే పలు కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొనగా, మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
